రామ్ చరణ్– ఎన్టీఆర్ బుల్లి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే వీరిద్దరూ ఏదన్నాషోకి వస్తున్నారా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఎన్టీఆర్ జెమిని టీవీలో రాబోతున్న మీలో ఎవరు కోటీశ్వరులు సినిమాకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ముందు ఈ ప్రొగ్రామ్ స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. అప్పుడు ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ తో స్టార్ట్ చేస్తూ హైప్ పెంచారు. ఇక ఇప్పుడు అలా షో షూటింగ్ మొదలు పెట్టాడో లేదో అప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ షోకు రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఎపిసోడ్ ను ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల లో భాగంగానే ఎమన్నా వాడుకుంటారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను కూడా వదిలారు. ఈ వీడియోతో సినిమాపై ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. మరి చూద్దాం ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: