సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. కోవిడ్ కారణంగా.. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయినా కూడా సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతుండడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎలాగైనా ముగించాలని అనుకున్న చిత్రబృందం.. అన్ని కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. హైద్రాబాద్ షెడ్యూల్ ను మాత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ లు మొదలవుతున్నాయి. దీంతో అన్నాత్తే టీమ్ కూడా షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ లోకి అడుగుపెట్టనుంది. కోల్ కత్తాలో ఫైనల్ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన చిత్రబృందం ఇప్పటికే అక్కడికి చేరుకోగా తాజాగా రజినీ కూడా చేరుకోవడంతో నేటి నుండి ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: