పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “రాధేశ్యామ్” అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. “రాధేశ్యామ్ “మూవీ మోషన్ పోస్టర్ గతసంవత్సరం అక్టోబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్‌లో 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టి దూసుకుపోతోంది. “రాధేశ్యామ్” మూవీ మోషన్ పోస్టర్ మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. భారత చలన చిత్ర చరిత్రలో మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టిన తొలి సినిమాగా “రాధేశ్యామ్” నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందిన “రాధేశ్యామ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: