శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (1994) ఆధారంగా“లాల్ సింగ్ చద్దా “ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ కశ్మీర్ లోని లడఖ్ లో జరుగుతుంది. “లాల్ సింగ్ చద్దా “ మూవీ లో నాగచైతన్య ఆర్మీ అధికారిగా కీలక పాత్రలో కనిపించనున్నారు. . ఆర్మీ అధికారి పాత్ర కోసం నాగచైతన్య ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కఠినమైన వ్యాయామాలతో శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “లాల్ సింగ్ చద్దా “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: