మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా చేతులమీదుగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టాన్ని చూపించారు. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ ను బట్టి జీవితంలో దేనికోసమూ ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి అతను నిజమైన ప్రేమలో పడితే.. ఆ అమ్మాయి కోసం తన తల్లిదండ్రుల కోసం ఇష్టపడే స్టాండప్ కామెడీ కోసం ఏం చేశాడు అన్నదే ఈ సినిమాకథలాగ అనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the Mic Dropping teaser for #StandUpRahul 🎙️ https://t.co/IPMYMeoUUy@itsRajTarun @VarshaBollamma @standupsanto @SweekarAgasthi @sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 @SonyMusicSouth#DreamTownProduction #HighFivePictures #SURteaser
— Rana Daggubati (@RanaDaggubati) July 9, 2021
ఇక ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: