టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “ది ఫ్యామిలీ మెన్ 2 “వెబ్ సిరీస్ ద్వారా సమంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టారు. ఆవెబ్ సిరీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో శకుంతల గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత”శాకుంతలం” మూవీ తో పాటు తమిళంలో “కాతువాకులా రెండు కాదల్” మూవీ లో నటిస్తున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి , నయనతార , సమంత ప్రధాన పాత్రలలో “కాతువాకులా రెండు కాదల్” మూవీ తెరకెక్కుతుంది. ఒక ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ .. ‘‘కాతువాకులా రెండు కాదల్’ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుందనీ , విజయ్‌సేతుపతి, నయనతారతో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉంటుందని వెల్లడించారు. తెరమీదే కాకుండా మా మాధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి స్నేహం ఉందనీ సమంత చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: