ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పోర్షన్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇక మరికొద్దిరోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తికానుంది. ఈసినిమా తరువాత రెండు సినిమాలు చేయనున్నాడు. ఇప్పటికే ఆ రెండు కూడా అధికారిక ప్రకటన వచ్చేశాయి. అందులో మొదటిది కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా కనీసం ఈఏడాది సినిమాలతో కాకపోయినా బుల్లితెరపై ఎన్టీఆర్ కనిపిస్తాడని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అది కుదరలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే కొత్త అప్ డేట్ ను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఎవరు మీలో కోటీశ్వరులు ఆడిషన్స్ జరిగాయి. కరోనా కారణంగా వాటిని నిలిపి వేశారు. మళ్లీ ఆడిషన్స్ ను పునః ప్రారంభించేందుకు జెమిని వారు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆడిషన్స్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇవ్వాలని జెమిని టీవీ వారు ఏర్పాట్లు చేస్తున్నారని.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగష్ట్ లోనే ఈ షో ప్రారంభం అవుతుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ మూవీ తో పాటు పార్లల్ గా షో ను కూడా ఎన్టీఆర్ ప్లాన్ చేయబోతున్నాడట. షో కోసం ఎన్టీఆర్ వారంలో రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం. మరి చూద్దాం ఈసారైనా ఈషో పట్టాలెక్కుతుందేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: