టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనడంతో మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే “రాధేశ్యామ్ “షూటింగ్ లో పాల్గొనడానికి ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు.”రాధేశ్యామ్” చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి చెన్నైలో అడుగుపెట్టారు కథానాయిక పూజాహెగ్డే. అక్కడ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘బీస్ట్’ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. గురువారం నుంచి చెన్నైలో ‘బీస్ట్’ రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. తొలిరోజు విజయ్, పూజాహెగ్డేపై సాంగ్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. మొత్తం 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్‌లో విజయ్, పూజాహెగ్డేపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ‘బీస్ట్’ పాట కోసం ‘రాధేశ్యామ్’ సెట్‌లో విరామ సమయంలో పూజా హెగ్డే ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: