హీరో సుమంత్ కూడా జయాపయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎక్కువ కమర్షియల్ హంగులకు పోకుండా.. తనకు సూటయ్యే పాత్రలు చేసే నటుల్లో సుమంత్ కూడా ఒకడు. సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్, కపటధారి సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం.
ప్రస్తుతం మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు సుమంత్. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కీర్తికుమార్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
My next film in Telugu as Writer & Director. Starring @iSumanth . Produced by Red Cinemas, Charan Tej, and @aditisoni1111 Creative Producer. Music by Anup Rubens, Cinematography @GRNSivakumaar , Edited by @PradeepERagav , Art Arjun pic.twitter.com/SHAEsF6oEM
— TG Keerthi Kumar (@tgkeerthikumar) July 1, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: