సాయి తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ‘రిపబ్లిక్‘ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్లకు, టీజర్ ను రిలీజ్ చేయగా మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా బ్రేక్ పడింది. అయితే పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడంతో.. లాక్ డౌన్ కూడా తీసేయడంతో షూటింగ్ లు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈసినిమా కూడా మళ్లీ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఇక ఈవిషయాన్ని సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. డబ్బింగ్ పనులు మళ్లీ రీస్టార్ట్ చేస్తున్నట్టు తను డబ్బింగ్ చెబుతున్న ఫొటో ను కూడా షేర్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Voicing for the Re’PUBLIC’ 🗣️🎙️ #DubbingRestarts #Republic pic.twitter.com/64m3YiGk5x
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2021
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: