ఈమధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. సినిమాలేకాదు.. వ్యక్తి గత విషయాలతో పాటు పలు విషయాలను కూడా తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తుంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను బట్టి కూడా రికార్డుల జాబితా ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలు మిలియన్స్ ఫాలోవర్స్ తో రికార్డులు క్రియేట్ చేశారు. ఇక తాజాగా రామ్ చరణ్ ఇన్ట్సాలో ఖాతా కూాాడా 4 మిలియన్స్ వ్యూస్ కు చేరుకుంది. నిజానికి రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా ఫేస్ బుక్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత చాలా కాలానికి ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టారు .లేటుగా ఎంట్రీ ఇచ్చినా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. చాలా రేర్ గానే ఏదో ఒక అప్ డేట్ వస్తుంటుంది. అయినా కూడా రామ్ చరణ్ ఇన్ స్టాగ్రాం ఖాతాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే చెర్రీ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో కనిపించనున్నారు. మరి కొద్ది రోజులలో చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఫస్ట్ టైమ్ చిరుతో కలిసి చరణ్ చాలాసేపు స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. శంకర్ తో సినిమాను ప్రకటించినప్పటికీ అది సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చెప్పడం కష్టం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: