ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది.. కానీ కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడగా.. తలైవి సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. మధ్యలో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా రాగా.. వాటికి చిత్రయూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని.. ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే చాలా పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో అరవింద్ స్వామి లెజెండరీ యాక్టర్… దివంగత మాజీ తమిళనాడు సీఎం ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నేడు అరవింద్ స్వామి పుట్టిన సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపోస్టర్ లో ఎంజీఆర్ లుక్ లో ఉన్న అరవింద స్వామి లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
To the one who’s as legendary as the role he’s portraying on screen, wishing our MGR @thearvindswami a very Happy Birthday💝#Thalaivi #KanganaRanaut #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @vibri_media @KarmaMediaEnt @urstirumalreddy @SprintFilms @ZeeStudios_ @TSeries pic.twitter.com/XR7BWW3haB
— Thalaivi The Film (@Thalaivithefilm) June 18, 2021
ఇక ఈ సినిమాలో కంగనాతో పాటు ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: