రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకూ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే కనీసం షూటింగ్ అయినా ఈపాటికి పూర్తయ్యేది. మరోవైపు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరోవైపు చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకాకు.. శంకర్ కు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల మరి ఈసినిమా ఎంత వరకూ సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కోసం హీరోయిన్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటినుండో అనుకుంటున్నట్టే కియారా అద్వానీనే ఈసినిమాలో చరణ్ కోసం లాక్ చేశాడట శంకర్. ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించిన మేకర్స్.. చివరకు కియరా అద్వానీ ని ఫైనలైజ్ చేశారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేఅవకాశం ఉందంటున్నారు. ఇంతకముందు ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కియరా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
కాగా కొరటాల శివ చేతుల మీదుగా ‘భరత్ అనే నేను’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కియరా. చరణ్ తో పాటు కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా కియారానే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: