హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రాజ రాజ చోర అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంగా.. ఇన్ని రోజులు కరోనా వల్ల ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇవ్వలేదు. రీసెంట్ గానే ఈసినిమా నుండి అప్ డేట్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన 2డీ వీడియోను రిలీజ్ చేయాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే దొంగతనాలు చేస్తూ సాఫ్ట్ వేర్ అని బిల్డప్పులిచ్చే క్యారెక్టర్‌లో ఎప్పటిలానే తన స్టైల్ లో న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. పూర్తి కామెడీ జోనర్ లో సాగే సినిమాగా టీజర్ బట్టి తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే దొంగతనాల నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైనప్పటికీ.. టీజర్ కట్ చేసిన విధానం రొటీన్ కు భిన్నంగానే వుంది. మేఘా ఆకాష్ తో కెమీస్ట్రీ బాగానే ఉండనున్నట్లు టీజర్ బట్టి తెలుస్తోంది.
Rajadhi Raja… Raja Raja Chora Vichesaarahoo!
Bahuparak.. Bahuparak…Here’s the hilarious teaser of #RajaRajaChora– https://t.co/taZcVCZtfM@sreevishnuoffl @akash_megha @TheSunainaa @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @hasithgoli @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/ptzigvY03K
— People Media Factory (@peoplemediafcy) June 18, 2021
కాగా మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: