‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. టైటిల్ ఇంకా పెట్టని ఈసినిమా విజయ్65 సినిమాగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇక కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈసినిమా నుండి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కి సంబంధించి టైం ను చిత్రయూనిట్ ఫిక్స్ చేసింది. మొదట జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ ట్రీట్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఒకరోజు ముందే జూన్ 21 సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఫస్ట్ లుక్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
కాగా ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తొమ్మిదేళ్ల తరువాత తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది పూజా హెగ్డే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: