సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాపుష్ప . సుకుమార్-బన్నీ కాంబినేషన్ కాబట్టి మొదటి నుండి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా గురించి వచ్చే రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వింటుంటే మాత్రం సినిమా ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు రిలీజ్ అవతుందా.. ఎప్పుడు చూడాలా అన్న ఎగ్జైట్ మెంట్ అయితే పెంచుతున్నారు చిత్రయూనిట్. బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా ఫుస్ రస్టిక్ లుక్ లో కనిపించడం.. ఇంకోవైపురెండు పార్ట్ లుగా రావడం.. ఇలా ఒకటేమిటీ అన్ని అంశాలు సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎలాగూ ఉంటాయన్న సంగతి తెలిసిందే.. అయితే మరో సాలిడ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు రెండు రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ కూడా అనుకున్న టైమ్ కే పూర్తి చేయనున్నారట. నిజానికి షూటింగ్ లు రద్దవకముందే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈసినిమా. అయితే ఇటీవల కాలంలో రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పటివరకూ షూట్ చేసింది దాదాపు పార్ట్ 1కు సరిపోతుంది. ఈనేపథ్యంలోనే జూన్ చివరి వారం నుండి షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. 25 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ ను హైద్రాబాద్ లో జరపనున్నారు.. జులై ఎండింగ్ వరకూ షూట్ ను పూర్తి చేయనున్నారు.
మరి ముందు చెప్పినట్టు ఈసినిమాను ఆగష్ట్ 13 న రిలీజ్ చేస్తారో లేక దసరా సీజన్ లో రిలీజ్ చేస్తారో అన్నది మాత్రం చూడాలి. ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: