సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ , 10 రోజుల కశ్మీర్ షూటింగ్ షెడ్యూల్ తో 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.జూన్ నెల చివరి వారం నుండి చిత్రీకరణను ప్రారంభిస్తున్నట్టు నిర్మాత నీలిమ గుణ తెలిపారు. ఈసారి తక్కువమందితోనే షూటింగ్ చేస్తామనీ , తరచూ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తగు జాగ్రత్తల నడుమ చిత్రీకరణ చేస్తామనీ అన్నారు. “శాకుంతలం ” మూవీని తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడ రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: