మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.. ఇంకా పది రోజులు షూటింగ్ చేస్తే చాలు ‘థాంక్యూ’ షూటింగ్ పూర్తవుతుందని చెప్పేశారు. జూలైలో షూటింగ్‌ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్ట్ నెలలో ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో రాశీఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: