బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన డాక్టర్ సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలంగాణ యువతి గా సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రస్తుతం సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో సాయి పల్లవి అప్పుడప్పుడు షేర్ చేసే ఫొటోలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి తన సినీ కెరీర్ లో 6 సంవత్సరాలు పూర్తి
చేసుకున్నారు.5సంవత్సరాల క్రితం టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి కేవలం 3 సినిమాలలో నటించడం ఆశ్చర్యం. “ఫిదా” , “పడిపడి లేచే మనసు” సినిమాలలో సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి, అందరినీ ఫిదా చేశారు. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదనీ , మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందనీ , మేకప్ లేకుంటనే బాగుంటాననీ చెప్పే సాయి పల్లవి పలు యాడ్స్ లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: