‘ప్రభాస్’ హాలీవుడ్ ఎంట్రీ- క్లారిటీ వచ్చేసింది

Rebel Star Prabhas Gives Clarity On His Entry Into Hollywood,Telugu Filmnagar,Rebel Star Prabhas Hollywood Entry,Prabhas To Star With Tom Cruise In Mission Impossible 7,Mission Impossible 7,Mission Impossible 7 Movie,MI 7,Director Christopher Mcquarrie,Christopher Mcquarrie,Tom Cruise,Tom Cruise Mission Impossible 7,Director Christopher Mcquarrie Clarifies On Rumours Of Prabhas In MI 7,Prabhas To Star With Tom Cruise,Christopher Mcquarrie Says He’s Never Met Prabhas,Is Prabhas Part Of Mission Impossible 7,Director Christopher Mcquarrie Responds On Prabhas In MI 7,Mission Impossible 7 Director Christopher Mcquarrie,Christopher Mcquarrie Reacts To Reports Of Prabhas Starring In MI 7,Christopher Mcquarrie About Prabhas In MI7 Movie,Prabhas In Tom Cruise’s Mission Impossible 7,Christopher Mcquarrie Dismisses Rumours Prabhas In MI 7,Christopher Mcquarrie About Prabhas,Rebel Star Prabhas,Prabhas,Prabhas New Movie,Prabhas Mission Impossible 7,Prabhas Mission Impossible 7

ఒక్క సినిమాతో ఏహీరోకి దక్కనంత గుర్తింపు దక్కింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు. బహుబలి సిరీస్ కోసం ఐదేళ్లు ఆయన టైమ్ ను కేటాయించగా.. దానికి తగిన ఫలితమే దక్కింది. కేవలం జాతీయ స్థాయిలోనే కాదు..అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సాహో తో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై తాాజాగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’లో ప్రభాస్‌ నటించనున్నారంటూ.. టామ్‌ క్రూజ్‌తో కలసి ప్రభాస్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. రాధేశ్యామ్‌ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లినప్పుడు అక్కడ క్రిస్టోఫర్ ప్రభాస్ ను కలిశారని.. స్క్రిప్ట్‌ను వినిపించారని.. ప్రభాస్ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఇలా కథనాలు అల్లేస్తున్నారు. దీనితో ఇప్పుడు ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ ఒక్కసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఆవార్తలు అంతా ఫేక్ అని అర్థమయిపోయింది. దీనిపై సోషల్ మీడియా ఒక నెటిజన్ డైరెక్టర్ గా క్రిస్టోఫర్‌ ను అడగటం జరిగింది. మిషన్ ఇంపాజిబుల్ లో ప్రభాస్ నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.. దీనిపై క్లారిటీ ఇవ్వండి అని అడుగగా దానికి క్రిస్టోఫర్ ప్రభాస్ చాలా టాలెంటెడ్ అని… అయితే తాము ఎప్పుడు కలవలేదని సింగిల్ స్టేట్ మెంట్ తో రూమర్స్ కి సింపుల్ గా చెక్ పెట్టేసారు. మరి ఇప్పటికైనా ఈవార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

 

ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ సినిమా.. తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.