1998 సంవత్సరంలో మెగా స్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్నవిషయం తెలిసిందే. అభిమానులతో పాటు సాధారణ ప్రజలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేస్తున్నారు . అత్యవసర సందర్భాలలో అన్ని హాస్పిటల్స్ వారూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించడం విశేషం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పలు సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా ఎంపిక అయ్యింది. చిరంజీవి ఇప్పుడు మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందుబాటు లో లేక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సకాలం లో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యం తో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లా కు ఒక ఆక్సిజన్ బ్యాంక్ నెలకొల్పడానికి చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో రానుంది. ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ హీరో రామ్ చరణ్ పర్యవేక్షణ లో నిర్వహించబడతాయి. చిరంజీవి నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: