గత ఏడాది మార్చి నుండి మన దేశంలో మొదలైన కరోనా ప్రభావం ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. జనవరి నుండి కాస్త కరోనా ప్రభావం తగ్గుతుంది సాధారణ పరిస్థితులు వస్తున్నాయి అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ కరోనా మహమ్మారి మరోసారి జూలు విడిచింది. ఇక గతంలోలాగానే సినీ పరిశ్రమ పై కూడా ఈసారి తన ప్రభావం చూపిస్తుంది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మృత్యువాత పట్టారు. ఆఖరికి యంగ్ గా ఉన్న సెలబ్రిటీలు కూడా చనిపోతుండటం గమనార్హం. ఫస్ట్ వేవ్ లో ఆర్థిక పరిస్థితుల వల్ల నిత్యవసరాలకు ఇబ్బంది పడగా.. ఇప్పుడు ఆక్సిజన్ ను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో సెలబ్రిటీల నుండి సామాన్యులదాకా అందరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత సాయం వాళ్లు అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడం కోసం, మరోవైపు ఉపాధి కోల్పోయిన ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో సీఎం స్టాలిన్ దాతలు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈనేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసిన తలైవా, 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
కాగా మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: