యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణ లో యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా”NTR30 ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ , ఎన్టీఆర్ కు జోడీగా నటించనున్నారని సమాచారం. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను ” మూవీ తో కియారా అద్వానీ ప్రేక్షకులను అలరించారు. “భరత్ అనే నేను “మూవీ తో కొరటాల శివ టాలీవుడ్ కు కియారా అద్వానీ ని కథానాయికగా పరిచయం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: