దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. మొదటి దశతో పోల్చితే రెండో దశ కరోనా అత్యంత ప్రమాదకరంగా మారింది. సరైన వైద్యసౌకర్యాలు అందక ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు . ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కొందరు కరోనా బాధితుల సహాయం కోసం ఆర్థిక సహాయం అందిస్తుండగా, మరికొందరు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కష్టకాలంలో సెలబ్రిటీస్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.ఆపదలో ఉన్నవారికి తగిన సాయం అందిస్తున్నారు. తాజాగా కరోనా బాధితులకు సహాయం అందించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నారు. . కోవిడ్ వ్యాప్తి నివారణ కు సోషల్‌మీడియా వేదికగా మహేష్ బాబు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. బుర్రి పాలెం గ్రామాన్ని మహేష్ బాబు దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. తాను దత్తతు తీసుకున్న బుర్రిపాలెం గ్రామ ప్రజలకు మహేష్ బాబు మరోసారి అండగా నిలిచారు. ఆ గ్రామస్థులకు వైద్య సౌకర్యాలతో పాటు కరోనా వ్యాక్సిన్‌ను మహేష్ బాబు ఏర్పాటు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: