ఈసారి హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్..!

Vaishnav Tej To Play Hockey Player In His Upcoming Movie Bankrolled By Annapurna Studios,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaishnav Tej,Actor Vaishnav Tej,Hero Vaishnav Tej,Vaishnav Tej Latest News,Vaishnav Tej New Movie,Vaishnav Tej Latest Movie,Vaishnav Tej New Movie Updates,Vaishnav Tej Latest Movie Updates,Vaishnav Tej Movies,Vaishnav Tej Next Movie,Vaishnav Tej Upcoming Movie,Vaishnav Tej Next Project,Vaishnav Tej Movie,Vaishnav Tej To Play Hockey Player,Hockey Player,Annapurna Studios,Vaishnav Tej To Turn A Hockey Player,Vaishnav Tej As Hockey Player In His Upcoming Movie,Vaishnav Tej To Play Hockey Player In His Upcoming Movie,Vaishnav Tej Upcoming Movie Details,Vaishnav Tej As Hockey Player,Vaishnav Tej New Movie Details

మొదటిసినిమాతోనే సాలిడ్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు రాగా.. వైష్ణవ్ తేజ్ మాత్రం మొదటిసినిమాతోనే మెగా యంగ్ హీరోలందరికీ పోటీగా నిలిస్తున్నాడు. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్ లో కూడా పెట్టాడు. ప్రస్తుతం ఇప్పుడు రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే నాగార్జున నిర్మాతగా మ‌రో సినిమా చేయ‌డానికి వైష్ణ‌వ్ తేజ్ ఓకే చెప్పేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అన్న‌పూర్ణ స్టూడియో నిర్మించ‌బోయే చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్లో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. పృథ్వీ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోయే ఈ సినిమా హాకీ నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ట‌. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా తన మేకోవర్ ను కూడా మార్చుకునే పనిలో పడ్డాడట. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నట్టు తెలుస్తుంది.

ఇక క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అందులో ఎలాంటి నిజం లేదని.. థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =