పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్”మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. సినీ సెలబ్రిటీస్ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు తమన్నా ఒక సందేశం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులతో పోలిస్తే, కరోనా ఫస్ట్ వేవ్ నథింగ్ అనీ , తన కొవిడ్ అనుభవం గురించి తమన్నా మాట్లాడుతూ …వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించి చికిత్స తీసుకున్నాననీ , ఆస్పత్రికి వెళ్ళే ముందు రోజు వరకూ షూటింగ్ లో పాల్గొన్నాననీ , కొంతమంది వైరస్ లక్షణాలు కనిపించినా చాలా లైట్ తీసుకుంటున్నారనీ , అటువంటి వాళ్ళని చూస్తే, భయం వేస్తుందనీ , ప్రస్తుతానికి వస్తే కుటుంబాలకు కుటుంబాలు తుడిచి పెట్టుకుపోతున్నాయనీ , పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనీ , బయటకు వెళ్ళకుండా ఇంటికే పరిమితం అయ్యి , కరోనా వ్యాప్తి ని అరికట్టండనీ తమన్నా ప్రజలకు సందేశం ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: