అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్బంగా రిలీజ్ అవ్వగా అది మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా తెచ్చిపెట్టింది. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకూ నవ్వుకుంటూనే ఉంటారని… మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సీక్వెల్ రానున్నట్టు ఇప్పటికే పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. అనుదీప్‌కు కూడా ఇప్పటికే స్క్రిప్ట్ పని ప్రారంభించాడని అంటున్నారు. ఈసినిమాకు కూడా నాగ్ అశ్వినే నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సీక్వెల్ లో కూడా జాతి రత్నలు టీమ్ నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నే ఈ సీక్వెల్ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ త్వరగా పూర్తి చేసి త్వరలోనే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. మరి జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయింది.. ఈసీక్వెల్ ఎంతవరకూ హిట్ అవుతుందో చూద్దాం..
కాగా జాతి రత్నాలు సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా.. మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు. స్వప్న సినిమా బ్యానర్ పై “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: