మెహ్రీన్ అండర్ వాటర్ ప్రపోజల్

Mehreen Pirzada Gets Proposed Under Water

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కెరీర్ బాగా ఉండగానే పెళ్లి పీటలెక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో వివాహ నిశ్చితార్థం ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ అండర్ వాటర్ లో భవ్య బిష్ణోయ్ మ్యారేజ్ ప్రపోజల్ కు సంబంధించిన వీడియోను మెహ్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

ఇక మెహ్రీన్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్3 సరసన నటిస్తుంది. ఆసినిమాలో వరుణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈసినిమా తరువాత మెహ్రీన్‌ సినిమాలు చేస్తుందో..?లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here