మొత్తానికి నితిన్ మాత్రం చాలా స్పీడు మీదున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఒకటి కాగా… రీసెంట్ గా రిలీజ్ అయిన రంగ్ దే సినిమా ఒకటి. రంగ్ దే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వెంటనే మరో సినిమాతో బిజీ అయిపోయాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అంధాధున్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలాగే టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: