“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది “మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్ “మూవీ లో హీరోగా నటిస్తూ విశ్వక్ సేన్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ “HIT – ది ఫస్ట్ కేస్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా రూపొందిన “పాగల్ ” మూవీ ఏప్రిల్ 30వ తేదీ రిలీజ్ కానుంది. మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ , చాందిని చౌదరి , మేఘ లేఖ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.”పాగల్ “మూవీ ట్రైలర్ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ , ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో 15 రోజులపాటు ప్రమోషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామనీ మేకర్స్ తెలిపారు. యాక్టర్ , రైటర్ , డైరెక్టర్ గా విశ్వక్ సేన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: