మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందే ఆర్ఆర్ఆర్ సినిమా నుండి బిగ్ ట్రీట్ వచ్చేసింది ఫ్యాన్స్ కు. నిన్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి రామరాజు లుక్ ను రిలీజ్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఇక నేడు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు అభిమానులకు. ఆచార్య సినిమా నుండి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరుతో పాటు చరణ్ కూడా ఉండటంతో మెగా అభిమానుల్లో..సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆచార్య “సిద్ధ ” …#HappyBirthdayRamcharan#Siddha #Acharya#AcharyaOnMay13 pic.twitter.com/Nk34oWYKRI
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2021
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ సిద్ద పాత్రలో తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మే 13 న ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరోవైపు చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈరెండు సినిమాల తరువాత శంకర్ తో సినిమాను చేయనున్నాడు. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: