చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా వారసుడు రామ్ చరణ్. మొదటి సినిమా అంత విజయం అందించలేకపోయినా రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తుడిపేశాడు. ఇక ఆతరువాత కొన్ని హిట్లు కొన్ని ఫ్లాప్స్.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రస్తుతం స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇక నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ నుండి చరణ్ రామరాజు లుక్ ను రిలీజ్ చేయగా చేతిలో విల్లు పట్టుకున్న చరణ్ లుక్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆచార్య నుండి లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో తండ్రి చిరుతో నటిస్తుండగా.. చిరుతో పాటు ఉన్న చరణ్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు లుక్స్ లో మీరు ఇంప్రెస్ అయినా.. మీకు బాగా నచ్చిన లుక్ ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”58129″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: