వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా రీమేక్ చేస్తున్న తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక గతకొద్ది కాలంగా వకీల్ సాబ్ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెపుతున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు తాాజాగా ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అది పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది… ఇక మార్చి 29 న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.. మరి ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: