‘సీటీమార్’ రిలీజ్ డేట్ వాయిదా

Seetimaar Movie Release Date Gets Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Seetimaarr,Seetimaarr Movie,Seetimaarr Film,Seetimaarr Telugu Movie,Seetimaarr Movie Telugu,Seetimaarr Update,Seetimaarr Movie Updates,Seetimaarr Film Update,Seetimaarr Movie Latest Updates,Seetimaarr Movie News,Seetimaarr Movie Latest News,Srinivasaa Silver Screen,Seetimaar Movie Release Date,Seetimaar Release Date,Seetimaar Telugu Movie Release Date,Seetimaar Release Date Gets Postponed,Seetimaar From April 2nd,Seetimaar Movie To Release On April 2nd,Seetimaar On April 2nd,Seetimaar Release Date Gets Postponed,Seetimaar Release Date Update,Seetimaar Release Date News,Seetimaar Release Date Postponed,Seetimaar Movie News Release Date,#Seetimaarr

సక్సెస్ కోసం ఎదురుచూసే హీరోల్లో గోపీచంద్ కూడా ఒకడు. సక్సెస్ అనే మాట విని చాలా కాలం అయింది. అయినా కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం సీటీమార్ సినిమాతో తన లక్ ను మరోసారి పరీక్షీంచుకోవడానికి వస్తున్నాడు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఎప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు.. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటవ్వడంతో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు తమ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే మరో రిలీజ్ డేట్ ను తెలుపుతామని ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాలో తమన్నా తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మరో కీలక పాత్రలో నటిస్తుంది. మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా కూడా న‌టిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 10 =