గత శుక్రవారం (మార్చి19)న మోసగాళ్లు, చావు కబుపు చల్లగా, శశి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. మూడు సినిమాలు కూడా మంచి రివ్యూస్ నే సొంత చేసుకున్నాయి. ఇక ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నితిన్ రంగ్ దే, రానా అరణ్య, శ్రీసింహా తెల్లవారితే గురువారం సినిమాలు ఉన్నాయి. అయితే మార్చి 26న రంగ్ దే, అరణ్య సినిమాలు రిలీజ్ అవుతుండగా. మార్చి 27న తెల్లవారితే గురువారం సినిమా రిలీజ్ కానుంది. మరి ఈసినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రంగ్ దే
ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ చాలా షార్ట్ గ్యాప్ తోనే రంగ్ దే సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
అరణ్య
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు.
తెల్లవారితే గురువారం
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్, వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: