యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో “అలిమేలు మంగ వేంకటరమణ “మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ “నిజం “, “జయం ” మూవీస్ లోనెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ ఇప్పుడు “అలిమేలు మంగ వేంకటరమణ “మూవీ లో హీరోగా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు తేజ ఒక వైవిధ్యమైన నేపథ్యం లో ఒక యాక్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు , గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ మూవీ లో కథానాయికగా కీర్తి సురేష్ నటించే అవకాశం ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో గొపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్ “ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్ “మూవీ కి హీరో గొపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: