సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకునే హీరో రామ్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటున్న హీరో రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. హీరో రామ్ ఇప్పుడు మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరోలను పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో పరిచయం చేసే దర్శకుడు బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా “BB3 ” మూవీ ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు బోయపాటి , హీరో రామ్ కాంబినేషన్ లో రూపొందే మాస్ ఎంటర్ టైనర్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: