సంక్రాంతి తరువాత సినిమా థియేటర్ లలో సినిమాలో సందడి ఎక్కవయింది. వారానికి కనీసం నాలుగౌదు సినిమాలు అయినా రిలీజ్ అవుతున్నాయి. అందులో బాగా ప్రమోషన్ చేసినవి.. కాస్త ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమాలు రెండు మూడు మాత్రమే ఉన్నా కూడా రిలీజ్ అవ్వడానికి మాత్రం బాగానే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. ఇక సినిమా హిట్ అయితే ఒకే ఫట్ అయితే వార్తల్లో కూడా కనిపించదు. ఇక ప్రతి వారం లాగే ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం. మరి ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గాలి సంపత్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే సినిమాపై మాత్రం అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు అలాంటి పాత్ర చేయడం.. ఫిఫీ లాంగ్వేజ్ తో మాట్లాడటం.. ఇంకా శ్రీ విష్ణు లాంటి నటుడు కొడుకుగా నటించడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఓరేంజ్ లో చేస్తున్నారు. ఈ మూవీని ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ఎస్. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి లాంటి నటుడు దానికితోడు ఇద్దరు బెస్ట్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తోడవ్వడంతో ఈ జాతి రత్నాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయడం పక్కా అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
రణరంగం, పడిపడి లేచే మనసు,జాను లాంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. ఈనేపథ్యంలో రైతులు, వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు శ్రీకారం సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: