ఈవారం బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పవర్ ప్లే, ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీ ముబారక్, గజకేసరి ఇలా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వచ్చేశుక్రవారం కూడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మార్చి 11 శివరాత్రి సందర్భంగా పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో గాలిసంపత్, జాతి రత్నాలు, శ్రీకారం సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈసినిమాలపై మాత్రం ఎక్సెపెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘గాలి సంపత్’. అనిష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈసినిమాపై ఇప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక రైతులు, వ్యవసాయం నేపథ్యంలో శర్వానంద్ శ్రీకారంతో వస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరోవైపు నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్ లో వస్తున్న జాతి రత్నాలు సినిమా. ఈ సినిమా కూడా టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి మూడూ మూడు డిఫరెంట్ జోనర్స్ లో వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ రాబోయే సినిమాల్లో ఏది మంచి హిట్ గా నిలుస్తుందో మీ ఓటు ద్వారా ఓ చిన్న గెస్ కొట్టండి.
[totalpoll id=”56845″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: