ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని రానా రెండు రోజులు క్రితం ప్రకటించిన సంగతి తెలసిందే కదా. ఇక చెప్పినట్టో ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రయిలర్ ను ఇంట్రస్టింగ్ గానే కట్ చేసారు. రానా బాడీ లాంగ్వేజ్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసారు. అడవికి సమీపంలో వున్న పట్టణంలో నిర్మించే టౌన్ షిప్.దాని కోసం ఏనుగులు వెళ్లే దారిని బ్లాక్ చేస్తూ భారీ గోడ నిర్మాణం, అడవిలో నక్సల్స్, చిన్నప్పటి నుంచి ఏనుగులతో సహవాసం చేస్తూ వాటిని కాపాడడమే ధ్యేయంగా పెట్టుకున్న హీరో ఇది ఆరణ్య స్టోరీ అని అర్ధమవుతుంది. తమిళనటుడు విష్ణు విశాల్ తో సహా అన్ని భాషలకు చెందిన తారలు ఇందులో వున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: