జయాపజయాలతో సంబంధం లేకుండా విబిన్నంగా సినిమాలు చేసే యువ హీరోల్లో శర్వానంద్ ఒకడు. కెరీర్ మొదటి నుంచి కూడా కాస్త డిఫరెంట్ గా ఉండే స్టోరీలనే చేయడాానికి ఇష్టపడుతుంటాడు శర్వా. ఇక ఇప్పుడు శ్రీకారంతో ముందుకు వస్తున్నాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా… ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. సెన్సార్ సభ్యులు ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈవిషయాన్ని శర్వా నంద్ తన ట్విట్టర్ పోస్ట్ చేస్తూ పంట చేతికొచ్చింది అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తామని తెలియచేశాడు.
పంట చేతికొచ్చింది!
Clean ‘U’ For #Sreekaram ♥Trailer Coming Soon! #SreekaramOnMarch11th@priyankaamohan @14ReelsPlus @Im_bkishor @saimadhav_burra @MickeyJMeyer @RaamAchanta #GopiAchanta @SonyMusicSouth pic.twitter.com/8omlSnkp5Z
— Sharwanand (@ImSharwanand) March 3, 2021
కాగా ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతితో మహాసముద్రం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: