రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది ఇంకా వ్యూస్ తో దూసుకుపోతూనే ఉంది. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ చిత్రంలో కృష్ణం రాజు కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పరమహంస అనే పాత్రలో నటిస్తున్నట్టు గతంలోనే తెలిపాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ప్రభాస్, కృష్ణం రాజు ఇద్దరూ ఒకే స్టిల్ ఇవ్వగా అది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ ఫొటోకు 70వ దశకం నాటి రోజులను ప్రభాస్‌తో కలిసి గుర్తుకు చేసుకుంటున్నాను.. రాధేశ్యామ్‌తో కలిసి మళ్లీ నాటి రోజుల్లోకి వెళ్దాం.. రాధే శ్యామ్ జూలై 30న రాబోతోందంటూ అంటూ ట్వీట్ చేసాడు.
Reminiscing the 70s with #Prabhas 🤩
Let’s go back in time with #RadheShyam on 30th July! pic.twitter.com/xhJD96U36i— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) February 16, 2021
కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనుండగా… రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.