గత ఐదు రోజుల నుండి ఎక్కడ విన్నా ఉప్పెన సినిమా టాపిక్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. మొదటి సినిమాతోనే అటు డైరెక్టర్.. ఇటు హీరో హీరోయిన్స్ రేంజ్ మారిపోయింది. అయితే ఏదో లక్ కాదులెండి.. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్ట్ బుచ్చిబాబు కథతో పాటు ముఖ్యంగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ల నటన, విజయ్ సేతుపతి విలనిజం.. డీఎస్పీ పాటలు ఇలా ప్రతి ఒక్క అంశం కలిసిరావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అంతేకాదు ఇప్పటికే డెబ్యూ హీరోస్ లో ఇంత భారీగా కలెక్షన్స్ రాబట్టిన హీరో లేడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇది తెలుగు వరకే. ఇక తాజాగా ఇండియన్ వైడ్ గా మరో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు వైష్ణవ తేజ్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డెబ్యూ ‘కహో నా ప్యార్ హై’ సినిమా గుర్తుండే ఉంటుంది కదా. ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలుసు. ఆయన నటించిన సినిమా అప్పట్లో 42 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఇప్పటివరకూ ఆ సినిమా రికార్డును బద్దలు కొట్టే రేంజ్ లో ఏ డెబ్యూ హీరోకు కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. అయితే ఇప్పుడు ఆ రికార్డు ను వైష్ణవ్ తేజ్ చెరిపేసి మరి రికార్డు సెట్ చేసి పెట్టాడు. ఇప్పటివరకూ ఉప్పెన 42 కోట్ల నెట్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. కేవలం ఐదు రోజుల కలెక్షన్స్ మాత్రమే ఇవి. ఇంకా వారం లోపు ఇంకెంత రాబట్టుకుంటుందో చూద్దాం.
మరో వైపు చిత్రయూనిట్ మాత్రం సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ కాకముందే కృతి శెట్టికి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఈ భామ డేట్స్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తారో చూడాలి. డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఇప్పటికే రెండు మూడు ఆఫర్స్ వాచినట్టు తెలుస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్ క్రిష్ తో ఇప్పటికే రెండో సినిమా కూడా పూర్తి చేసేసాడు.. ఈ సినిమా ఎఫెక్ట్ ఆ సినిమాకు సాలిడ్ క్రేజ్ తెచ్చిపెట్టింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: