అలా సినిమా మొదలు పెట్టాడో లేదో ఇలా షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి మనకు తెలిసిందే.. చాలా తక్కువ టైం షూటింగ్ ను కంప్లీట్ చేసే డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ముందుంటాడు. ఒక్కసారి సినిమా మొదలు పెడితే మినిమమ్ 5 నెలల్లో కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పటికే మనం చూశాం. ఇప్పుడు ఎఫ్3 సినిమా షూటింగ్ కూడా రాపిడ్ స్పీడ్ లో అవ్వగొడుతున్నాడు.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టగా తాజాగా సెకండ్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రెండో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.. మళ్లీ సెట్స్ పైకి వచ్చేంత వరకూ వెయిట్ చేయలేను… త్వరలోనే మూడో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నాం.. దానికి సంబంధించిన అప్ డేట్స్ త్వరలోనే ఇస్తా అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
We are done with our 2nd schedule. Can’t wait to get back on sets to enjoy the fun. Will be back with more updates when 3rd schedule kick-starts. #F3Movie#F3onAug27th @Venkymama @IamVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP@SVC_official #F3 pic.twitter.com/l4xLl20naY
— Anil Ravipudi (@AnilRavipudi) February 17, 2021
దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 లో నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. అన్నపూర్ణమ్మ, వై.విజయ, ప్రగతి, రఘుబాబు, ప్రదీప్, నిర్మాత శిరీష్ తదితరులు వున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
కాగా 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ‘ఎఫ్2’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. దీనితో ఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు వరుసగా 5 విజయాలు అందుకున్న అనిల్ డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఎఫ్3 ఆ విజయాన్ని అందిస్తుందో లేదో చూద్దాం..




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.