సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. దానికితోడు చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
* హీరో,హీరోయిన్స్..వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరికీ ఇది మొదటి సినిమా అయినా కూడా టీజర్, ట్రైలర్ లలో వీరిద్దరి నటన చూస్తే మాత్రం అనుభవం ఉన్న నటీనటుల్లాగానే చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సినిమా రిలీజ్ కాకముందే అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ అప్పుడే క్యూ కడుతున్నాయి.
* విజయ్ సేతుపతి… విజయ్ సేతుపతి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు.. ఆయన నటన ఎలా ఉంటుందో ఆయన చేసిన సినిమాలే ఉదాహరణ. ఇక ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ విజయ్ సేతుపతి. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే ట్రయిలర్ లో విజయ్ పాత్ర ఎలా ఉంటుంది అనేది చూశాం.
* దేవి శ్రీ ప్రసాద్.. ఒక సినిమాకు కథ.. కథనం ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం.
* డైరెక్టర్.. సుకుమార్ సినిమాలు ఎలా వుంటాయో తెలుసు.. ఆ స్కూల్ నుండి వచ్చిన డైరెక్టరే బుచ్చిబాబు. బుచ్చి బాబు కు కూడా డైరెక్టర్ గా ఈ సినిమా మొదటి సినిమానే. కానీ సుక్కూ దగ్గర పనిచేసిన అనుభవం ఉండటంతో ఆ అనుభవం ఎంత ఉపయోగపడిందో సినిమా టేకింగ్ చూస్తే చెప్పొచ్చు. అంతేకాదు మంచి కథతో వస్తున్నాడన్న విషయం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లను బట్టి అర్ధమవుతుంది. ఇప్పటికే డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
* మైత్రీ మూవీ మేకర్స్.. అతి తక్కువ కాలంలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్. నిర్మాతలు నవీన్ యర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించారు. ఆ సినిమాలు చూసి ఈ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ విలువలు ఎలా ఉంటాయో చెప్పొచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాలు నిర్మిస్తారు. ప్రతి ఫ్రేమ్ లోనూ ఆ రిచ్ నెస్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కూడా మైత్రీ మూవీ నుండే వస్తుంది.
మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాపై ఆ మాత్రం అంచనాలు ఏర్పడటం కామనే. మరి రేపు థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయడమే తరువాయి..




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.