‘ఎన్టీఆర్’ తో ప్రశాంత్ నీల్ సినిమా.. ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా..ఉండదా అనేది గతకొంత కాలంగా నడుస్తున్న సస్పెన్స్. కె.జి.యఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తాడని.. ఎన్టీఆర్ చేస్తాడని ఆ మధ్య వార్తలు రాగా.. ఆ వార్తలకు క్లారిటీ ఇస్తూ ప్రభాస్ తో సినిమా కన్ఫామ్ చేసాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు ప్రభాస్, ప్రశాంత్ నీల్. ఇక ఇదిలా ఉండగా మరోసారి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలే.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న నిర్మాతలని ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడుగగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉంది.. సలార్ సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని క్లారిటీ ఇచ్చారు. మరి మొత్తానికి ఇన్నిరోజులు ఉన్న ఒక కన్ఫ్యూజన్ కి అయితే ఒక క్లారిటీ వచ్చింది.
#Uppena interviews chudandi guru 🙂 https://t.co/JWC0K4MN9A
— Mythri Movie Makers (@MythriOfficial) February 10, 2021
#ntr31 #NTRBDayFiestaBegins @tarak9999 @prashanth_neel @worldNTRfans @NTRFanTrends pic.twitter.com/G0zJ7CMKv2
— Venu boxer (@VenuVL1) February 10, 2021
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ప్రశాంత్ నీల్ సినిమా అయ్యే గ్యాప్ లో ఈ సినిమా ఫినిష్ చేసి తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇంకా వీటితో పాటు ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలతో సత్తా చూపెట్టిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా.. అట్లీ దర్శకత్వంలో కూడా మరో సినిమా ఇలా వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. మరి వీటిలో ఎన్ని సినిమాలు లైన్ లో పెడతాడో చూద్దాం..



Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.