‘జాంబిరెడ్డి’ రివ్యూ – ఫన్ అండ్ థ్రిల్లింగ్

Zombie Reddy Telugu Movie Review,2021 Telugu Movie Reviews,Latest Telugu Movie Reviews,Zombie Reddy,Zombie Reddy Movie,Zombie Reddy Movie Plus Points,Zombie Reddy Movie Public Opinion,Zombie Reddy Movie Public Talk,Zombie Reddy Movie Review,Zombie Reddy Movie Review And Rating,Zombie Reddy Movie Story,Zombie Reddy Movie Updates,Zombie Reddy Movie Rating,Zombie Reddy Telugu Movie,Zombie Reddy Telugu Movie Public Talk,Zombie Reddy Telugu Movie Latest News,Zombie Reddy Telugu Movie Live Updates,Zombie Reddy Review,Zombie Reddy Telugu Movie Public Response,Telugu Film Updates 2021,Telugu Filmnagar,Tollywood Latest Film Reviews,Tollywood Movie Updates

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జా హీరోగా తెరకెక్కిన సినిమా ‘జాంబిరెడ్డి’. ఈ సినిమాపై మొదటినుండి మంచి అంచనాలు ఉన్నాయి. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించగా ఈ సినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్‌, పృథ్వీ రాజ్‌, గెటప్‌ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు
దర్శకుడు : ప్రశాంత్‌ వర్మ
నిర్మాత : రాజశేఖర్‌ వర్మ
సంగీతం : మార్క్‌ కె. రాబిన్‌

కథ..

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయం. ఆ టైములో హీరో తేజ సజ్జా అతని ఫ్రెండ్స్ కలిసి వేరే ఊరులో ఉన్న ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఊరిలో ఒక్కొక్కరుగా జాంబీలుగా మారిపోతుంటారు. హీరోతో పాటుగా మరో నలుగురు తప్ప అందరూ జాంబీలు గా మారిపోతారు.మరి వాళ్లు జాంబీలను ఎలా ఎదుర్కున్నారు. వాటి నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారు? అన్నది ‘జాంబిరెడ్డి’ కథ.

విశ్లేషణ..

ఎప్పుడు రొటీన్ కథలు కాకుండా వెరైటీగా ట్రై చేసే డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. అలాంటి డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక మూడో సినిమాలో కూడా వైవిధ్యతను చూపించాడు. ఇప్పటివరకూ ఈజోనర్ లో సినిమా రాలేదు. హాలీవుడ్ లో అయితే ఎన్నో సీజన్స్ వచ్చాయి. మనవాళ్ళకి కూడా కాస్త చూసిన అనుభవం ఉంది. ఇలాంటి జోనర్ లో సినిమా తీయడం అంటే కొంచం కష్టమే.. ఎందుకంటే కొంచం తేడా కొట్టినా కూడా ప్రేక్షకులు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ధైర్యంగా ఒకడుగు ముందుకేసి ఈజోనర్ తీసి మెప్పించాడంటే అతన్ని మెచ్చుకోవాల్సిందే. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఫిక్షన్ నేపథ్యంలో హారర్‌ సినిమాకు కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ ఈ సినిమా తెరకెక్కించిన విధానం ఆకట్టుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచం నెమ్మదిగా సాగినా ఇంటర్వల్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అక్కడినుండి నెక్స్ట్ ఎం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని అయితే పెంచగలిగాడు ప్రశాంత్ వర్మ. జాంబీస్ అంటే ఏదో సీరియస్ మోడ్ కాకుండా మన తెలుగు వాళ్లకు కావాల్సిన కామెడీ ని కూడా జత చేసి పూర్తిగా విజయం సాధించాడనే చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాలో నటించిన తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పుడే తన నటనతో మెప్పించాడు. ఆవయసులోనే ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. ఓ బేబీ సినిమాలో ఒక పాత్ర ద్వారా నటుడిగా మారగా ఇక ఈ సినిమాతో పూర్తి నటుడిగా మారాడు. ఈ సినిమాలో కూడా చాలా సెటిల్డ్ గా నటించాడు. ఎక్కడా ఎక్కువ చేయకుండా.. ఏ సన్నివేశానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అంతే ఇస్తూ తన రోల్ కు ఎంత చేయాలో అంతే చేస్తూ ఆకట్టుకుంటాడు.

ఇక సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించిన నందిని ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ దక్ష నాగార్కర్ కూడా పాత్రకు తగ్గట్టుగా చేసింది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర గెటప్ శ్రీను గురించి. గెటప్ శ్రీను చేసిన కామెడీ కూడా సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. సెకండ్ హాఫ్ లో సినిమాని నిలబెట్టాడు. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి.

ఇక టెక్నికల్ గా అనిత్ ఫోటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. విజువల్స్‌, మేకింగ్‌ అన్నీ సరిగ్గా సరిపోయాయి. మార్క్ కె. రాబిన్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్.

ఓవరాల్ గా చెప్పాలంటే రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టే తరుణంలో ఇలాంటి డిఫరెంట్ జానర్లో సినిమా రావడం ప్రేక్షకులను కాస్త ఆనందాన్నిచ్చే విషయమే. ఇప్పటివరకూ హాలీవుడ్ జాంబీస్ చూసి ఎంజాయ్ చేసిన మనకు.. ప్రశాంత్ వర్మ తెలుగు జాంబీస్ ను పరిచయం చేసాడు. ఇక ఈ జాంబిరెడ్డి సినిమాను కూడా ఫ్యామిలీతో కలిసి చూసిఎంజాయ్‌ చేయొచ్చు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here