‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ ప్రభాస్ సినిమా అప్ డేట్ కచ్చితంగా ఇస్తానని నాగ్ అశ్విన్ ప్రభ్స్ ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రామిస్ చేసినట్టే ఎక్కువ టైమ్ తీసుకోకుండా అప్ డేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు పనిచేయబోయే సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ ను ఈ సినిమాకు సంగీతం దర్శకునిగా ఎంపికచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Proudly presenting our heroes behind the screen.
Welcome @dancinemaniac and @MickeyJMeyer onboard our #PrabhasNagAshwin Project.#Prabhas @nagashwin7 @SrBachchan @deepikapadukone @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/cVJKxmwe8p
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 29, 2021
ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ సలార్ మూవీ షూట్ తర్వాత ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ షెడ్యూల్ తో ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరోవైపు ఆదిపురుష్ సినిమాను కూడా షురూ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: