వరుస పెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. గత ఏడాది కరోనా వల్ల పెండింగ్ లో ఉన్న సినిమా రిలీజులన్నీ ఈఏడాది క్యూ కట్టాయి. ఇప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఫిబ్రవరి, మార్చికి చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో సర్పైజింగ్ అప్ డేట్ ఇచ్చారు ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్. మహేష్ సర్కారు వారి పాట ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఇటీవలే కాస్త ఊరట కలిగింది. ఈసినిమా షూటింగ్ ను ఈ మధ్యనే ప్రారంభించారు. దుబాయ్ లోప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అలా షూటింగ్ ను మొదలు పెట్టారో లేదో అప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జనవరి 2022న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి 2019 సంక్రాంతికి మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. 2020 సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. మరి 2022 లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూద్దాం.
Super Star Sankranthi Once Again 💥💥#SarkaruVaariPaata Releasing for Sankranthi 2022 🔔
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus pic.twitter.com/ns5cDGlf4q
— Mythri Movie Makers (@MythriOfficial) January 29, 2021
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరగనుంది. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: