మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , సునీల్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప “మూవీ షూటింగ్ కేరళ స్టేట్ ఫారెస్ట్ లో ప్లాన్ చేసినా కరోనా కారణంగా ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “పుష్ప “మూవీ, యూనిట్ మెంబర్స్ కు కరోనా సోకడంతో షూటింగ్ నిలిచిపోయింది. తిరిగి మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకై తమిళ హీరో ఆర్య ఎంపిక అయ్యారని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన “వరుడు “మూవీ లో ఆర్య విలన్ గా నటించిన విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆర్య మరోసారి అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: